'పగటి కలలు కనకండి.. మీ ఫ్యూచరేంటో మీకే తెలియదు'.. హరీష్‌కు పొంగులేటి కౌంటర్

ఫ్యూచర్ సిటీని వంద శాతం రద్దు చేస్తామన్న బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌లో మీ ఫ్యూచర్ ఏంటో మీకే తెలియదు, అలాంటి మీరు ఫ్యూచర్ సిటీని ఆపుతారా? అంటూ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. పదేళ్ల పాలనలో ఒక మెట్రో స్టేషన్ కూడా కట్టని వారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నగరమే నిర్మిస్తుంటే అసూయతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్‌లు కట్టుకుంటే తాము దేశం గర్వించేలా ఫ్యూచర్ సిటీ కడుతున్నామని ముందు హరీశ్‌రావు తన పొలిటికల్ ఫ్యూచర్ కాపాడుకోవాలని హితవు పలికారు.