బందరు తీరానికి జెయింట్‌ డ్రెడ్జర్‌!

బందరు పోర్టు డ్రెడ్జింగ్‌ పనుల్లో కీలక ముందడుగు పడనుంది. నత్తనడకన సాగుతున్న పనులను పరుగులు పెట్టించడానికి నెదర్లాండ్స్‌ నుంచి జెయింట్‌ డ్రెడ్జర్‌ను తీసుకొచ్చేందుకు కాంట్రాక్టు సంస్థ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసింది. విదేశీ ఫ్లాగ్‌తో కూడిన షిప్‌ కమ్‌ డ్రెడ్జర్‌ బందరు తీరానికి చేరాలంటే కేంద్ర హోంమంత్రిత్వశాఖ, విదేశాంగ మంత్రిత్వశాఖల అనుమతి అవసరం. కాంట్రాక్టు సంస్థ ఇచ్చిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అనుమతులు ఇవ్వటమే ఆలస్యం. ఈ జెయింట్‌ డ్రెడ్జర్‌ (టీఎస్‌హెచ్‌డీ) కనుక బందరు తీరానికి వస్తే శరవేగంగా డ్రెడ్జింగ్‌ పనులను చేపట్టడానికి వీలు కలుగుతుంది.