మధిర రైతుసభ రద్దు.. రైతు భరోసా నిధుల విడుదలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

రైతు భరోసా సదస్సు నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఖమ్మం జిల్లా మధిరలో రైతు సభ జరగాల్సి ఉంది. అయితే వర్షాల నేపథ్యంలో ఆ సభను ప్రభుత్వం రద్దు చేసింది. హైదరాబాద్ శిల్పకళా వేదికలో రైతు భరోసా సదస్సు నిర్వహించాలని నిర్ణయించింది. మంగళవారం సాయంత్రం 4 గంటలకు శిల్పకళా వేదికలో రైతు భరోసా సమావేశం జరగనుంది. ఇక్కడి నుంచే సీఎం రేవంత్ రైతుభరోసా నిధులను రైతుల అకౌంట్లలో జమచేయనున్నారు. ఈ నిధుల కోసం రైతులు వెయ్యి కళ్లతో ఎదరుచూస్తున్నారు.