యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలి ఏర్పాటు.. ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త, చిరంజీవి సతీమణికి చోటు

తెలంగాణ ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి 18 మందితో నూతన పాలక మండలిని ఏర్పాటు చేసింది. బోర్డు ఛైర్మన్‌గా ప్రముఖ పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణరెడ్డిని, సభ్యులుగా చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ తదితరులను నియమించింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి అభివృద్ధిపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భూముల యాజమాన్య హక్కులు ఆలయానికే ఉండేలా, తిరుమల తరహాలో మఠాలు, అతిథి గృహాల కేటాయింపు నిబంధనలు, పీపీపీ విధానంలో టూరిజం సర్క్యూట్ అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు.