రేషన్ లబ్ధిదారులకు అలర్ట్.. నేటి నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభం

తెలంగాణలోని రేషన్ లబ్ధిదారులకు అలర్ట్. జులై నెలకు సంబంధించిన రేషన్ నేటి నుంచి ఇవ్వనున్నారు. 2.15 లక్షల టన్నుల బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా 1.06 కోట్ల రేషన్ కార్డుదారుల కుటుంబాలకు పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా 3.41 కోట్ల మంది లబ్ధి పొందనున్నారు. గోదాముల్లో యాసంగి ధాన్యం నిల్వల సమస్యను అధిగమించేందుకు, ఎండల తీవ్రత దృష్ట్యా గతంలో ఏప్రిల్-మే-జూన్ కోటాను ముందస్తుగా పంపిణీ చేశారు. జులై కోటా బఫర్ స్టాక్‌ను ఇప్పటికే రేషన్ షాపులకు చేర్చారు. పంపిణీలో ఎలాంటి అక్రమాలు జరగకుండా ఈ-పాస్ బయోమెట్రిక్, డిజిటల్ తూకాలను పారదర్శకంగా అమలు చేయాలని, క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ ఉండాలని పౌరసరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు.