ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర విషాదం.. మంటల్లో కాలిపోయిన బస్సు.. ఏడుగురు మృతి, 22 మందికి గాయాలు

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లోని రుషికేశ్ నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు వెళ్తున్న ఓ స్లీపర్ బస్సు రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఢిల్లీ - ముంబై ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదానికి గురైంది. ముందు ఉన్న ట్రక్కును ఢీకొన్న బస్సు ఆ వెంటనే అదుపు తప్పి లోయలోకి పడింది. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో ఐదుగురు సజీవ దహనం కాగా, మరో ఇద్దరు తీవ్రగాయాలతో మృతిచెందారు. ఈ ఘటనలో 22 మంది గాయపడ్డారు.