రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిన రైతు.. రూ.7 పెట్టుబడితో ఏకంగా కోటి రూపాయల లాభం, ఎలాగంటే?

కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టడం కాదు.. ఏకంగా తలుపులు బద్ధలు కొట్టుకుని వస్తుంది. సరిగ్గా ఇదే జరిగింది పంజాబ్‌కు చెందిన బల్కార్ సింగ్ అనే సామాన్య రైతు విషయంలో. గత పదేళ్లుగా ప్రతిరోజూ ఆశతో ఒక లాటరీ టికెట్ కొంటూ వస్తున్న ఆయనను.. ఈసారి ఏకంగా కోటి రూపాయల బంపర్ ప్రైజ్ వరించింది. విశేషం ఏమిటంటే.. ఆయన ఆ టికెట్ కొన్నది కేవలం 7 రూపాయలకే. డ్రా జరిగిన ఐదు రోజుల వరకు తన తలరాత మారిందన్న విషయం కూడా తెలియని ఈ రైతు.. చివరకు కోటీశ్వరుడినని తెలిసి పట్టరాని ఆనందంతో చిందులేశారు.