రాష్ట్రస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీలకు ఎంపిక
సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన జిల్లాస్థాయి కిక్‌బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఆదర్శ పాఠశాల 8వ తరగతి విద్యార్థిని జి.శ్రీనిధి ప్రతిభ కనబర్చి, గోల్డ్ మెడల్ సాధించింది.