వీధి కుక్కల దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత.. నష్ట పరిహారం చెల్లించాల్సిందే.. సుప్రీంకోర్టు

దేశవ్యాప్తంగా ఉన్న వీధి కుక్కల సమస్యపై సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. పిల్లలు, వృద్ధులపై దాడి జరిగితే అందకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తేల్చిచెప్పింది. అంతేకాదు, బాధితులకు ప్రభుత్వాలు నష్టపరిహారం చెల్లించాలని సుప్రీం స్పష్టం చేసింది. ఒక వేళ కుక్కలకు ఆహారం పెట్టేవారు కూడా దీనికి బాధ్యులని, అలాంటి వారు వాటిని తమ ఇళ్లకే తీసుకెళ్లాలని సూచించింది. విద్యాసంస్థలు, ఆసుపత్రుల వంటి చోట్ల నుంచి కుక్కలను తొలగించాలని ఆదేశించింది.