హర్మూజ్‌లో నౌకలపై దాడుల్లో భారతీయ నావికుడు మృతి.. ఇరాన్‌కు గట్టి సందేశం పంపిన భారత్

ప్రపంచం అనుకున్నదే జరిగింది. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. ఇరు దేశాలూ మరోసారి పరస్పర దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మొదటికొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా, హర్మూజ్ జల సంధిలో యూఏఈకు చెందిన నౌకలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్ చేసిన దాడిలో ఒక భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోయాడు.. మరో 10 మంది భారతీయులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది.