Puri Rath Yatra: రేపే నవయవ్వన దర్శనం.. గంటసేపు మాత్రమే భక్తులకు భాగ్యం

ప్రముఖ శ్రీ క్షేత్రం పూరీ జగన్నాథుడి ఆలయంలో రథయాత్ర వేడుకలకు ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా జ్యేష్ఠ పౌర్ణమి రోజున పరిమళ జలంతో నిర్వహించిన దేవస్నాన వేడుక తర్వాత స్వామివారికి పక్షం రోజుల పాటు గోప్య చికిత్స, పత్యం నిర్వహించారు. పురుషోత్తముడికి ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలు, పాలు, పండ్లు, తేనె మాత్రమే ఈ పదిహేను రోజులు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆషాఢ మాసం శుక్లపక్ష పాఢ్యమి నాడు నవయవ్వన నేత్రోత్సవం జరుగుతుంది.