అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ... భారత్ ఆసక్తికర స్పందన

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. రెండువారాలపాటు కాల్పుల విరమణకు ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ మేరకు తమ సైనిక విభాగాలన్నీ కాల్పులు నిలిపివేయాలని ఇరుదేశాలు ఓ నిర్ణయానికి వచ్చాయి.అయితే ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల నిర్ణయంతో పశ్చిమాసియాలో శాంతి నెలకొంటుందని ఆశిస్తున్నట్లు 'ఎక్స్' వేదికగా భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.‘కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నాం. ఇది పశ్చిమాసియాలో శాశ్వత శాంతికి దారి తీస్తుందని ఆశిస్తున్నాం. ఉద్రిక్తతలు తగ్గించడం కోసం దౌత్యపరమైన చర్చలు అవసరమని భారత్ మొదటి నుంచి చెబుతోంది. ఈ సంఘర్షణ ప్రపంచ దేశాలకు, ప్రజలకు ఇప్పటికే ఎంతో ఇబ్బందికర పరిణామాలను కలిగించింది’అని భారత్ అభిప్రాయపడింది., News News, Times Now Telugu