ఆగండి మస్క్: ఎలాన్ మస్క్‌కు ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య లేఖ

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో ఎదుర్కొంటున్న కష్టాలపై ఆయన మాజీ భార్య, రచయిత్రి జెమీమా గోల్డ్‌స్మిత్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ దృష్టిని ఆకర్షించారు. ఇమ్రాన్ గురించి తాను ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై పెడుతున్న పోస్టులు ప్రజలకు చేరడం లేదని, తన ఖాతాలో ఉన్న విజిబిలిటీ ఫిల్టరింగ్‌ను సరిచేయాలని ఆమె మస్క్‌కు బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. చట్టవిరుద్ధంగా నిర్బంధంలో ఉన్న తమ తండ్రిని చూసేందుకు, మాట్లాడేందుకు మా కుమారులకు అనుమతి లేదు. కేవలం ఎక్స్ ద్వారా మాత్రమే ఇమ్రాన్ పరిస్థితిని ప్రపంచానికి చెప్పగలం అని జెమీమా తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత సున్నితమైన రాజకీయ అంశంపై, బిడ్డల తరఫున ఆమె చేసిన ఈ విజ్ఞప్తి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.