ఎంత ఘోరం.. బావ డిగ్రీ వాడుకుని డాక్టర్‌గా మారిన బామ్మర్ది, సొంత అక్క ఫిర్యాదుతో..?

మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అమెరికాలో ప్రాక్టీస్ చేస్తున్న తన బావ డాక్టర్ డిగ్రీలను అక్రమంగా వాడుకొని.. అభినవ్ సింగ్ అనే వ్యక్తి ఏకంగా నాలుగేళ్ల పాటు ఒక మెడికల్ కాలేజీలో స్పెషలిస్ట్ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. ఈ బాగోతంపై అభినవ్ సింగ్ సొంత సోదరి డాక్టర్ సోనాలిసింగ్ ఉన్నత వైద్యాధికారులకు ఫిర్యాదు చేయడంతో మోసం బయటపడింది. తన భర్త డాక్టర్ రాజీవ్‌ కుమార్‌ గుప్తా పేరు, సర్టిఫికెట్లను దుర్వినియోగం చేస్తూ.. తన తమ్ముడు అక్రమ వైద్యుడిగా పని చేస్తున్నాడని పేర్కొంది. దీంతో అప్రమత్తమైన మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఈ విషయంపై విచారణ జరుపుతున్నారు.