ఏటీసీ కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలి

ఏటీసీ నైపుణ్య కోర్సులను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. శనివారం ప్రభుత్వ ఐటీఐ కేంద్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సెంటర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.2324 కోట్లకుపైగా ఖర్చు చేసి ప్రజా ప్రభుత్వం 65 ఐటీఐ సెంటర్‌లను అధునాతన సాంకేతిక కేంద్రాలుగా అప్‌గ్రేడ్‌ చేస్తోందన్నారు. ఏటీసీలో నైపుణ్య శిక్షణ పొందిన పిల్లలకు కనీసం రూ.20 వేల ప్రారంభ వేతనంతో ఉపాధి లభించేలా అనేక కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు.