ఏపీలో ఎయిర్‌బస్ విమానాల తయారీ.. త్వరలో భారీ పెట్టుబడి?

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనువైన రాష్ట్రం అని అన్నారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్. ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షిస్తోందని తెలిపారు. అందులో భాగంగా తొలిసారి ఇండియా వచ్చిన ఎయిర్‌బస్ బోర్డుతో ఢిల్లీలో మంత్రి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రపంచస్థాయి ఏరోస్పేస్ తయారీ కేంద్రాన్ని, ఇంటిగ్రేటెడ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని ఎయిర్‌బస్‌ను కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను బోర్డుకు వివరించారు. తయారీ కర్మాగారాల ఏర్పాటుకు భూమి సిద్ధంగా ఉందని.. దీంతో పాటు మౌలిక సదుపాయాలు కూడా అందిస్తామని లోకేశ్ చెప్పారు.