కాన్పూర్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో హైడ్రామా.. ఆయుధాలతో కమిషనరేట్‌ను ముట్టడించిన ITBP జవాన్లు, కారణం ఇదే..

తన తల్లికి జరిగిన ఘోర వైద్య నిర్లక్ష్యంపై కాన్పూర్ పోలీసులు స్పందించకపోవడంతో ఒక ఐటీబీపీ జవాన్‌కు మద్దతుగా దాదాపు 50 మంది సాయుధ జవాన్లు కాన్పూర్ పోలీస్ కమిషనరేట్‌కు భారీ వాహనాల్లో చేరుకున్నారు. సదరు జవాన్ తల్లికి తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఆమె కుడి చేయి దెబ్బతిని చివరకు వైద్యులు దాన్ని తొలగించాల్సి వచ్చింది. న్యాయం కోసం జవాన్ తన తల్లి తెగిపడిన చేతిని ఐస్ బాక్స్‌లో పెట్టుకుని పోలీసు స్టేషన్ వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. పైగా సదరు ఆసుపత్రిని వెనకేసుకొచ్చేలా పోలీసుల తీరు ఉండటంతో జవాన్లు రంగంలోకి దిగారు.