టికెట్ స్క్వాడ్‌ను చితకొట్టిన కండక్టర్... క్రిమినల్ చర్యలకు టీజీఎస్ఆర్టీసీ ఆదేశం, అసలేం జరిగింది?

హైదరాబాద్ నుంచి నారాయణఖేడ్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును సంగారెడ్డి జిల్లా రాయకోడ్ వద్ద టికెట్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు కోసం ఆపారు. బస్సులో తనిఖీ చేయగా ఒక ప్రయాణికుడి నుంచి రూ.20 తీసుకున్న కండక్టర్ టికెట్ ఇవ్వలేదు. ఈ విషయాన్ని గమనించిన అధికారులు ఛార్జ్‌మెమో ఇస్తుండగా వారిపై కండక్టర్ దాడికి దిగాడు. ప్రయాణికులు సైత దాడికి పాల్పడ్డాడు. ఛార్జి మెమో ఇవ్వకుండా ఉండాలంటే 20 వేల రూపాయలు ఇవ్వాలంటూ లంచం డిమాండ్ చేశారని అందుకే దాడి చేసినట్లు కండక్టర్ ఆరోపించారు. అయితే తాము ఎలాంటి లంచం డిమాండ్ చేయలేదని ఛార్జ్ మెమో నుంచి తప్పించుకునేందుకు తమపై నిందలు మోపుతున్నారని... అదే సమయంలో ప్రయాణికులను సైతం రెచ్చగొట్టి తమపై దాడికి ఉసిగొల్పాడని వారు అంటున్నారు. అయితే ఈ ఘటనను టీజీఎస్ఆర్టీసీ సంస్థ సీరియస్‌గా తీసుకుంది. కండక్టర్‌పై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది., News News, Times Now Telugu