తీరం దాటిన వాయుగుండం.. ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. రైతులకు కీలక అలర్ట్

AP Weather Today Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలహీనపడి, శ్రీలంక తీరాన్ని దాటింది. దీని ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలోని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈక్రమంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. వర్షం కురిసేందుకు అవకాశం ఉండటంతో.. రైతులు పంట నూర్పిళ్లను వేగవంతం చేసి, ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.