నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా

తెలంగాణలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఓ వినూత్న ఘటన చోటుచేసుకుంది. పెళ్లి పీటలపైనే వరుడు నాగేంద్రకు బీఎల్‌ఓ ఓటరు నమోదు ఫారం అందించగా, వెంటనే వివరాలు నమోదు చేసి దరఖాస్తు సమర్పించాడు. ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పిన ఈ సంఘటన అతిథులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో ప్రశంసలు అందుకుంటోంది.