నాగ్‌పూర్‌లో భారీ పేలుడు.. 17 మంది మృతి.. శిథిలాల కిందే మరింత మంది

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున భారీ పేలుడు సంభవించింది. కటోల్ ప్రాంతంలోని ఎస్‌బీఎల్‌ నర్జీ లిమిటెడ్ అనే పేలుడు పదార్థాల తయారీ కేంద్రంలో ఈ ఘటన జరగ్గా.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో మొత్తంగా 17 మంది మృతి చెందగా.. మరో 18 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. అలాగే ఇంకా కొంత మంది శిథిలాల కిందే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈక్రమంలోనే ఇంకా సహాయక చర్యలు చేపడుతున్నారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి తీవ్ర విషమంగా ఉండగా.. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.