Two youths killed after crashing into an electric pole
వజ్రపుకొత్తూరు మండలం చినతామాడవానిపేట గ్రామం సమీపంలో విద్యుత్ స్తంభాన్ని బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఇదే మండలం ఉద్దాన గోపినాథపురానికి చెందిన కర్ని కోదండరావు(28), గర్తంవానిపేటకు చెందిన గర్తం మణికంఠ (23).. సైనూరులో జరుగుతున్న గ్రామదేవత ఉత్సవాలకు ద్విచక్ర వాహనంపై ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో వెళ్లారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటిగంట సమయంలో తిరిగి తమ ఊర్లకు బయలుదేరారు. చినతామాడవానిపేట గ్రామం వద్ద వీరి బైక్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.