నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగం.. భూసేకరణకు సహకరించాలి
కొడంగల్, వెలుగు: నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు వేగం అందుకుంటున్నాయి. గురువారం కొడంగల్ మండలంలోని ప్యాలమద్ది, పెద్దనందిగామ గ్రామాల్లో ఆర్డీవో అనిత గ్రామసభల ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.