ఏపీ మహిళలకు మరో శుభవార్త.. త్వరలో ఏసీ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం?

ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకాన్ని మరింత విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రస్తుతం సాధారణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందుతున్న మహిళలకు త్వరలో ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి తెలిపారు.