ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు.. మరోసారి చేతిలో డైరీతో సీఎం విజయ్

ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన నటుడు, టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. పాలనలో తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేస్తోన్న దళపతి విజయ్.. సామాన్యుల సమస్యలపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల చెన్నైలోని ఎగ్మోర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బందిపై ఆరోపణల వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో అదే ఆసుపత్రిలో ఆయన తనిఖీలకు వెళ్లారు. ఆకస్మికంగా అక్కడకు సీఎం రావడంతో వైద్యులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు.