పుష్యమి నక్షత్రాన రామయ్యకు పట్టాభిషేకం
భద్రాద్రి రామయ్యకు పుష్యమి నక్షత్రం సందర్భంగా ఆదివారం పట్టాభిషేకం చేశారు. చామరాలు, ఖడ్గం, డాలు, గద, గొడుగుతోపాటు కిరీటం అలంకరించి ప్రోక్షణ జలాలను రామయ్యపై చల్లి పట్టాభిషేకం నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవ, సువర్ణ పుష్పార్చనలు కనుల పండువగా సాగాయి. బేడా మండపంలో ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం చేశారు.
మార్చి 2, 2026
1