బంగ్లాదేశ్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్.. హైకమిషనర్‌కు సమన్లు, సెవెన్ సిస్టర్స్ వ్యాఖ్యల వల్లే?

పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో భారత్‌కు వ్యతిరేకంగా వినిపిస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేంద్ర ప్రభుత్వం గట్టి చర్యలకు దిగింది. భారత ఈశాన్య రాష్ట్రాలను ముట్టడిస్తామంటూ బంగ్లాదేశ్ రాజకీయ నాయకుడు హస్నత్ అబ్దుల్లా చేసిన తీవ్ర వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషనర్ మహమ్మద్ రిజాజ్ హమీదుల్లాకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసి, తన నిరసనను అధికారికంగా తెలియజేసింది. అటు ఢాకాలోని భారత హైకమిషన్‌కు వస్తున్న బెదిరింపులు, ఇటు సరిహద్దుల్లో నెలకొన్న అస్థిరతపై భారత్ తన వైఖరిని స్పష్టం చేస్తూనే.. సరిహద్దు వెంబడి నిఘాను పకడ్బందీగా పెంచింది.