భర్త చనిపోయినా.. అతని ఆస్తి నుంచి మాజీ భార్యకు భరణం వస్తుంది: బాంబే హైకోర్టు సంచలన తీర్పు

విడాకులు తీసుకున్న భర్త మరణించినా.. అతని ఆస్తి నుంచి నెలవారీ భరణం పొందే చట్టబద్ధమైన హక్కు మాజీ భార్యకు ఉంటుందని బాంబే హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వైద్య ఖర్చులు, నిత్యావసరాల ధరలు పెరిగాయనే సాకుతో ఆ భరణం మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేయలేరని కోర్టు పేర్కొంది. మాజీ భర్త మరణానంతరం అతని వారసులు తమ సొంత కష్టంతో వృద్ధి చేసుకున్న ఆస్తులను ప్రాతిపదికగా తీసుకుని భరణాన్ని పెంచడం ఎంతమాత్రం సమంజసం కాదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.