మనిషిని గొప్పవాడిగా మార్చే 'నువ్వులు-బెల్లం' జీవన సత్యం ఇదే..: గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

మకర సంక్రాంతి పండుగలోని జీవన తత్వాన్ని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ అద్భుతంగా వివరించారు. ఈ పండుగలో మనం పంచుకునే నువ్వులు, బెల్లం కేవలం మిఠాయిలు మాత్రమే కావని.. అవి మనిషి వ్యక్తిత్వానికి నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు. అహంకారం నువ్వు గింజంత చిన్నగా ఉండాలని.. మాటలు బెల్లంలా తియ్యగా ఉండాలని ఆయన సందేశమిచ్చారు. నువ్వుల పైపొర తొలగితే వచ్చే స్వచ్ఛత మనిషి అంతర్గత శుద్ధిని సూచిస్తుందని.. చిన్న చిన్న కోరికలు వీడి అనంతమైన సృష్టిలో వినమ్రతతో పంచుకుంటూ జీవించడమే నిజమైన పండుగ అని అన్నారు.