మిమ్మల్ని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా...మీ ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటా: ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

‘నాకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా,ఒకసారి ఎంపీగా,రెండు సార్లు మంత్రిగా మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించారు. రాష్ట్రంలోనే ముఖ్య నాయకుడిగా నన్ను నిలబెట్టారు. మీరు చూపెడుతున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటా...మీకు ఎంత చేసినా తక్కువ’అని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా నల్లగొండ పట్టణంలో 1వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థి ఆలకుంట్ల నాగరాజు, 2వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గురిజాల నరేందర్( పానగల్-రోడ్ షో), 3వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న గాలి వినోద( పానగల్ & నందీశ్వర -కాలనీ రోడ్ షో)లకు మద్దతుగా నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.పానగల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద రోడ్‌షోలో మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రసంగించారు.‘మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకులనే కార్పొరేటర్ అభ్యర్థులుగా పెట్టిన. కార్పొరేషన్ ఎన్నిక పేద ప్రజలకు మంచి చేసే ఎన్నికలు.ఇప్పుడు గెలిచే కార్పొరేటర్లు మీ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు’అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు., News News, Times Now Telugu