రోడ్డుపైకి ఒక్కరే కారేసుకుని వచ్చారంటే ఫైన్ కట్టాల్సిందే.. కొత్తగా రాబోతున్న ఈ కంజెషన్ ట్యాక్స్ ఏమిటి?

బెంగళూరు నగరంలో ట్రాఫిక్ కష్టాలు విపరీతంగా పెరిగిపోవడంతో.. కర్ణాటక ప్రభుత్వం ఓ సంచలన ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. 90 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా.. రద్దీ సమయాల్లో ఔటర్ రింగ్ రోడ్డు వంటి ప్రాంతాల్లోకి ప్రవేశించే సింగిల్-ఆక్యుపెన్సీ (ఒకే వ్యక్తి ఉన్న) ప్రైవేట్ వాహనాలపై కంజెషన్ ట్యాక్స్ విధించాలని యోచిస్తోంది. దీని ఉద్దేశం కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించడం. ఈ ఫీజును నేరుగా ఫాస్టాగ్ ద్వారా వసూలు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడకుండా ఈ పన్ను విధించడంపై పౌరుల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి.