రైతులకు తీపి కబురు.. ఈ పంటలు సాగు చేస్తే రైతు భరోసాతో పాటు ఎకరాకు రూ.8 వేల అదనపు సాయం..!

తెలంగాణలో సుస్థిర వ్యవసాయం, రైతుల ఆదాయ భద్రత కోసం ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ వర్సిటీ సమగ్ర వ్యవసాయ విధానం-2026 నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ఐదేళ్లలో 25 లక్షల ఎకరాల్లో వరి స్థానంలో ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, ఇందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చే రైతులకు ఎకరానికి రూ.4 నుంచి రూ.8 వేల వరకు నగదు బదిలీ చేయాలని సూచించింది. బలమైన మార్కెటింగ్, ప్రభుత్వ నిధులతో పంటల బీమా, వాల్యూ ఎడిషన్ ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నివేదికపై జులై 2న మంత్రిమండలి చర్చించనుంది.