శశిథరూర్ బావమరిదికి ఆర్మీలో కీలక పదవి.. సదరన్ కమాండ్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్‌

పుణే కేంద్రంగా ఉన్న సదరన్ కమాండ్ కొత్త జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్‌ను ఇండియన్ ఆర్మీ నియమించింది. జూలై 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఖార్గా కార్ప్స్ కమాండర్‌గా ఉన్న రాజేష్ పుష్కర్‌కు 35 ఏళ్లకు పైగా సైనిక అనుభవం ఉంది. ఆధునిక యుద్ధ సాంకేతికత, డ్రోన్లు, సైనిక దౌత్యం, స్ట్రైక్ ఆపరేషన్లలో విశేష అనుభవం కలిగిన ఆయన నాయకత్వంలో సదరన్ కమాండ్ మరింత ఆధునికీకరణ దిశగా ముందుకు సాగనుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. ఇక తన బావమరిదికి కీలక పదవి రావడంపై శశిథరూర్ స్పందించారు.