అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించబోయిన చైనా మహిళ.. అడ్డంగా దొరికిపోవడంతో..!

భారత సరిహద్దుల్లో చైనా పౌరుల కదలికలు మరోసారి కలకలం రేపుతున్నాయి. ఎలాంటి పాస్‌పోర్ట్, వీసా పత్రాలు లేకుండా అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఒక చైనీస్ యువతిని సశస్త్ర సీమా బల్ (SSB) జవాన్లు చాకచక్యంగా పట్టుకున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లా నౌటన్వా సరిహద్దు వద్ద కాలిబాట మార్గంలో అనుమానాస్పదంగా వస్తున్న ఆమెను అడ్డుకోగా.. అసలు విషయం బయటపడింది. ఆమె వద్ద దొరికిన ఒక చిన్న చీటి ఆధారంగా ఆమె పేరు హుజియా జీ అని గుర్తించిన పోలీసులు.. ప్రస్తుతం ఆమెను రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు.