అమెరికా - ఇజ్రాయెల్ మధ్య హీట్.. "చంపడం ఒక్కటే పరిష్కారం కాదు" అంటూ మండిపడ్డ జేడీ వాన్స్

ఇరాన్‌తో శాంతి ఒప్పందం పూర్తయిన తర్వాత అమెరికా - ఇజ్రాయెల్ సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. ట్రంప్‌ని టార్గెట్‌గా చేస్తూ ఇజ్రాయెల్ నేతలు విమర్శలకు దిగుతుండగా.. ఇజ్రాయెల్ తీరుపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌కు ఇప్పుడు ప్రపంచంలో మద్దతుగా నిలుస్తున్న ఏకైక నాయకుడు ట్రంప్ అనేది గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. కాల్పుల విరమణ చేయాలని ట్రంప్ చెబుతుంటే.. దక్షిణ లెబనాన్‌లో సైనిక చర్యలు కొనసాగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ చెప్పడం ఆసక్తికరంగా మారింది.

అమెరికా - ఇజ్రాయెల్ మధ్య హీట్..