అయోధ్యలో హుండీ డబ్బులు మాయం చేసిన సిబ్బంది.. రూ.7 కోట్ల విరాళాలు గల్లంతు? అదుపులో 8 మంది

అయోధ్య రామ మందిరం హుండీలో నగదు చోరీ కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఆరుగురు విరాళాల నగదు లెక్కించే ఉద్యోగులే ఉండటం గమనార్హం. ఆలయ విరాళాల్లో రూ. 7 నుంచి రూ. 7.5 కోట్ల వరకు మాయమై ఉంటాయని నివేదికలు చెబుతున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ ఈ అంశాన్ని లేవనెత్తి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దర్యాప్తు వివరాలు బయటకొస్తేనే పూర్తి విషయం తెలుస్తుంది.