అవసరంలేని స్థాయిలో డిజిటల్ వ్యవసాయానికి ప్రోత్సాహం.. రోజురోజుకూ సంక్షోభంలో రైతాంగం
ప్రపంచంలో యుద్ధాలు, వాణిజ్యం, వాతావరణ మార్పుల నేపథ్యంలో భారత వ్యవసాయంలో సమూల పరివర్తన అవసరం ఉన్నది. దాదాపు అన్ని రాష్ట్రాలలో రైతాంగం రోజురోజుకూ సంక్షోభంలో కూరుకుపోతున్నది.