ఆధార్ అప్డేట్ ఛార్జీలు పెంపు.. అక్టోబర్ 1 నుంచే అమల్లోకి.. దేనికి ఎంతంటే?

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆధార్ అప్‌డేట్ సేవలకు సంబంధించిన రుసుములను పెంచింది. ఈ పెంపుదల కారణంగా ఇకపై మీ పేరు, చిరునామా వంటి డెమోగ్రాఫిక్ వివరాలను మార్చుకోవడానికి.. అలాగే వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్ వంటి బయోమెట్రిక్ వివరాలను అప్‌డేట్ చేయడానికి అదనంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఈ సవరించిన ధరలు సెప్టెంబర్ 30వ తేదీ 2028 వరకు అమలులో ఉంటాయి. అయితే చిన్నపిల్లలకు సంబంధించిన తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్లు మాత్రం ఉచితంగా కొనసాగుతాయని UIDAI స్పష్టం చేసింది.