టీటీడీకి వెళ్ళే నెయ్యి ట్యాంకర్ల వద్ద లంచాలు తీసుకున్న తిరుచానూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగి తంబూరు రాధాకృష్ణను ఉద్యోగం నుంచి తొలగించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆరు నెలల వ్యవధిలోనే టీటీడీకి భోలేబాబా డెయిరీ సరఫరా చేసిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ ఏకంగా రూ. 3.68 లక్షలు లంచంగా వసూలు చేశాడీ ఘనుడీయన. సిట్ అధికారులు కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో భాగంగా భోలేబాబా డెయిరీకి కమీషన్ ఏజెంట్గా పనిచేసిన పీపీ శ్రీనివాసన్ను ప్రశ్నించడంతో పాటు అతడి వద్ద డెయిరీలు, పలు రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. అతడి వద్ద లభించిన ఒక డైరీలో తిరుచానూరు మార్కెట్ కమిటీలో ఔట్సోర్సింగ్
ప్రాతిపదికన వాచ్మెన్గా పనిచేసే తంబూరు రాధాకృష్ణకు అలిపిరి చెక్ పోస్టు వద్ద రూ. 3.68 లక్షలు లంచం ముట్టజెప్పిట్టు నమోదై వుంది. అది కూడా 2023 ఫిబ్రవరి 27 నుంచీ సెప్టెంబరు 11వ తేదీ వరకూ అంటే ఆరు నెలల వ్యవధిలో ఈ మొత్తాన్ని అతడికి లంచంగా ఇచ్చినట్టు నమోదై వుంది. ఆ లెక్కన టీటీడీకి వెళ్ళే ఇతర డెయిరీలకు చెందిన నెయ్యి ట్యాంకర్ల నుంచీ కూడా తప్పకుండా లంచాలు వసూలు చేసివుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.15 ఏళ్ళుగా అతడు కమిటీలో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. ఆ లెక్కన ఇతర చోట్ల, చెక్పోస్టుల్లో వేర్వేరు వ్యవసాయ ఉత్పత్తులు తరలించే వాహనాల నుంచీ
ఎంతెంత వసూలు చేసివుంటాడోనన్న చర్చ నడుస్తోంది.