నిషేధిత మందులను విక్రయిస్తూ... సొమ్ము చేసుకుంటున్న డ్రగ్స్ ముఠా గుట్టును తిరుపతి ఈస్ట్ పోలీసులు రట్టు చేశారు. అక్రమ డ్రగ్స్ ముఠా సభ్యులను ఎనిమిది మందిని అరె్‌స్టచేసి పెద్దఎత్తున నిషేధిత మందుల నిల్వలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు.అనంతపురానికి చెందిన లక్కిశెట్టి నాగార్జున అక్కడి మెడికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా తిరుపతికి చెందిన పాతకమూరి నాగేశ్వరరావుకు నిషేధిత మందులను సరఫరా చేస్తున్నారు. ఆయన వాటిని తిరుపతి పరిసరాల్లో ఆటో డ్రైవర్లు, వలస కూలీలకు
విక్రయించడమే కాక.....తనవద్ద మందులు తీసుకుంటున్న వారిని కూడా వ్యాపారులుగా మార్చి వారిద్వారా వ్యాపారాన్ని విస్తరించాడు.ఈస్ట్ పోలీసు బృందం డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ప్రశాంతితో కలిసి దాడులు నిర్వహించి చింతలచేను రామతులసి కళ్యాణమండపం వద్ద డ్రగ్స్ ముఠా సభ్యులు 8 మందిని మంగళవారం అరెస్ట్ చేసింది. వారినుంచి 33 బాక్స్‌ల లెనీడాల్ 100 ఎంజీ టాబ్లెట్లు, 10 ఆస్కారిల్-సి సిరప్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. లక్కిసెట్టి నాగార్జున, పాతకమూరి నాగేశ్వరరావు, ఆలతూరు రాజ్‌కుమార్, దిగవింద్లు ఆంజనేయులు, కుడుముల జనార్థన్, మేదూరి గౌతమ్, కోనేటి జగదీ్‌షబాబు, వెంకటే్‌షలను అరెస్ట్ చేయగా, ధనలక్మి అలియాస్ ధనమ్మ, పద్మ, చందు, ప్రతాప్, విష్ణు, ప్రదీప్ అనే
ఆరుగురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీఎస్పీ వెల్లడించారు.