100 రోజుల ప్రణాళికలో జిల్లాకు 5వ స్థానం

టెన్త్‌ విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమల్లో జిల్లా ఐదో స్థానంలో నిలిచింది. డిసెంబరు ఒకటిన మొదలైన ఈ కార్యక్రమం మంగళవారానికి 67 రోజులు పూర్తి చేసుకుంది. 65 రోజుల పురోగతి నివేదికను రాష్ట్ర విద్యాశాఖ సోమవారం సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన థర్డ్‌ మినిస్టర్స్‌, సెక్రటరీ కాన్ఫరెన్స్‌లో సమర్పించింది. ‘సీ’ గ్రేడే ఎక్కువ జిల్లాలోని 353 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలల్లో 15,812 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి ప్రతి రోజూ ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులు సబ్జెక్టుల వారీగా స్లిప్‌ టెస్టులు పెట్టి, మూల్యాకనం చేసి, మార్కులను విద్యాశాఖ రూపొందించిన యాప్‌లో పొందుపరుస్తున్నారు. ప్రస్తుతం టెన్త్‌ విద్యార్థులకు ప్రీ-ఫైనల్స్‌ జరుగుతున్నాయి. ఈ క్రమంలో విద్యార్థుల గ్రేడింగ్‌కు సంబంధించి వివరాలను వెల్లడించింది. ఏ గ్రేడ్‌ (80-100 మార్కులు)లో 1,145 మంది, బీ గ్రేడ్‌ (60-79 మార్కులు)లో 3991, సీ గ్రేడ్‌ (35-59 మార్కులు)లో 7027 మంది, డీ గ్రేడ్‌ (35 మార్కులు)లో 3030 మంది విద్యార్థులు ఉన్నట్లు నివేదికలో వెల్లడించింది. డీ గ్రేడ్‌పై దృష్టి సారిస్తారా? వంద రోజుల కార్యక్రమం ముగియడానికి 33 రోజులే ఉంది. దీంతో డీ గ్రేడ్‌లోని 3030 మంది విద్యార్థులను కనీసం పాస్‌ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాగా వెనకబడిన విద్యార్థులకు నైట్‌ విజన్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తామని డీఈవో రాజేంద్రప్రసాద్‌ ఇటీవల ప్రకటించారు. ఇది పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఫలితాలు మెరుగుపడే అవకాశం లేకపోలేదు.