సినీ నిర్మాత బండ్ల గణేశ్ పాదయాత్రలో హీరో విశ్వక్ సేన్...ఫోటోలు వైరల్

ప్రముఖ సినీనటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్పయాత్ర ముగిసింది. ఈ సంకల్పయాత్ర ముగింపు రోజున సినీనటుడు విశ్వక్ సేన్ సైతం పాల్గొన్నారు. బండ్ల గణేశ్‌తో కలిసి సినీనటుడు విశ్వక్ సేన్ అడుగులో అడుగు వేశారు. ఈ సందర్భంగా పాదయాత్ర గురించి పలు అంశాలపై చర్చించుకున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని సైతం బండ్ల గణేశ్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.ఇకపోతే అలిపిరి పాదాల చెంతకు చేరుకున్న బండ్ల గణేశ్ అక్కడ స్వామివారికి మెుక్కులు చెల్లించుకున్నారు. దాదాపు 507 టెంకాయలు కొట్టి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరంశ్రీవారి దయతో తన కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తూ కాలినడకన తిరుమల కొండపైకి ప్రయాణం ప్రారంభించారు. ఈ పాదయాత్రలో బండ్ల గణేశ్‌తో పాటు ఎమ్మెల్సీ శ్రీకాంత్, ఎమ్మెస్ చౌదరి కూడా పాల్గొన్నారు. వీరిద్దరూ కొంత దూరం పాటు కలిసి నడుస్తూ బండ్ల గణేష్‌కు మద్దతు తెలిపారు. స్వామివారి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందాలని వారు ప్రార్థించారు. జనవరి నెలలో షాద్‌నగర్ నివాసం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కొనసాగుతుంది. దాదాపు 520 కిలోమీటర్ల వరకు పాదయాత్ర కొనసాగినట్లు తెలుస్తోంది. ఇకపోతే బుధవారం ఉదయం బండ్ల గణేశ్ శ్రీ తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది., News News, Times Now Telugu