ఇరాన్‌పై మరిన్ని భీకర దాడులు చేస్తాం... మా జోలికి వచ్చినవారిని వదిలి పెట్టం: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప

ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌పై మరిన్ని భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. తమ జోలికి వచ్చిన వారిని వదిలిపెట్టం అని అన్నారు. ఇరాన్ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. ఇరాన్‌, అమెరికా-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధవాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో ఆ దేశాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఓ ప్రముఖ ఛానెల్‌లో సోమవారం మాట్లాడారు. తమ జోలికి ఎవరు వచ్చినా వదిలిపెట్టేది లేదని ట్రంప్ హెచ్చరించారు. త్వరలో మరిన్ని తీవ్ర దాడులు ఉంటాయని...ప్రజలంతా సురక్షితంగా ఉండాలని...వారు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సూచించారు., News News, Times Now Telugu