ఒక్క రాత్రిలోనే కోటీశ్వరుడైన ట్యాక్సీ డ్రైవర్.. రూ.500 పెట్టి టికెట్ కొంటే రూ.3 కోట్ల లాటరీ

అదృష్టం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో చెప్పలేమనడానికి ఈ ఘటనే నిదర్శనం. పొరుగు రాష్ట్రానికి ప్యాసింజర్‌ను దింపేందుకు వెళ్లిన ఒక సాధారణ ట్యాక్సీ డ్రైవర్‌ను అద్భుతమైన జాక్‌పాట్ వరించింది. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాటరీలో హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కల్యాణ్ చంద్‌ అనే డ్రైవర్ కేవలం రూ. 500 టికెట్‌తో ఏకంగా రూ. 3 కోట్ల మెగా బహుమతిని గెలుచుకున్నారు. నిత్యం అరకొర సంపాదనతో కుటుంబ భారం మోస్తున్న అతడు.. ఒకే ఒక్క రోజులో కోటీశ్వరుడిగా మారగా ఇతడి స్టోరీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.