కొలను భారతి ఆలయ వివాదంపై శ్రీశైలం దేవస్థానం విచారణ
శ్రీశైలం దేవస్థానం దత్తత ఆలయమైన కొలను భారతి క్షేత్రంలో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. అనుమతులు లేకుండా హోమాలు నిర్వహించారనే ఆరోపణలపై దేవస్థానం ఈవో శ్రీనివాసరావు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.