చెత్తకుప్పలో 36 తులాల బంగారు నగలు.. వాటిని చూసిన మహిళ ఏం చేసిందంటే?

లోకమంతా డబ్బు వెంట పరుగులు తీస్తున్న ఈ రోజుల్లో.. చేతికి చిక్కిన లక్షల విలువైన సంపదను కూడా తృణప్రాయంగా భావించి తన నిజాయితీని చాటుకుంది ఓ సామాన్య పారిశుధ్య కార్మికురాలు. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో విధుల్లో ఉన్న పద్మ అనే కార్మికురాలికి రోడ్డు పక్కన పడి ఉన్న ఒక సంచి దొరికింది. దానిని తెరిచి చూసిన ఆమెకు ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి. అందులో ఏకంగా 36 తులాల (సుమారు రూ. 45 లక్షల విలువైన) బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆ నిరుపేదరాలు తలుచుకుంటే ఆ బంగారం తనదని దాచుకోవచ్చు.. కానీ ఆ తల్లి తన నిజాయితీనే అసలైన సంపదగా భావించింది. నగలు పోగొట్టుకున్న వారు ఎంత క్షోభ అనుభవిస్తారో అని ఆలోచించి వెంటనే దాన్ని పోలీసులకు అప్పగించి యజమాని చెంతకు చేరేలా చేసింది.