తండ్రి వద్దే శిక్షణ, ఊళ్లో ప్రాక్టీస్.. చివరకు బీచ్‌లో దారుణం: సిడ్నీ ఉగ్రదాడి కేసులో విస్తుపోయే విషయాలు

ఆస్ట్రేలియా చరిత్రలోనే అత్యంత కిరాతకమైన ఉగ్రదాడిలో ఒకటైన బాండీ బీచ్ షూటింగ్ వెనుక ఉన్న అసలు భయానక కోణాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ మారణహోమానికి పాల్పడిన తండ్రీకొడుకులు సాజిద్‌ అక్రమ్‌, నవీద్‌ అక్రమ్‌ కేవలం కాల్పులే కాకుండా.. ఏకంగా జనంపైకి బాంబులు విసిరి భారీ ప్రాణనష్టానికి స్కెచ్ వేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే అవి పేలకపోవడం వల్ల పెనుప్రమాదం తప్పింది. మరోవైపు తండ్రే కుమారుడికి కాల్పుల శిక్షణ ఇచ్చినట్లు.. ఇద్దరూ కలిసి తమ ఊళ్లోనే ప్రాక్టీస్ కూడా చేసినట్లు అధికారులు గుర్తించారు.