తెలంగాణలోని వాహనదారులకు గుడ్‌న్యూస్: ఇకపై ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు... మార్చి 15 నుంచి ఆ సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో వాహనాలు కొనుగోలు చేసే వారికి, ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలు దారులకు, కొత్త రిజిస్ట్రేషన్ ప్రక్రియలో సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ‘వాహన్’పోర్టల్‌లో చేరనుంది. ఈ వాహన పోర్టల్ అందుబాటులోకి రావడం ద్వారా వాహనదారులు ఆన్‌లైన్‌లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దాని ఫలితంగా ఆఫీసుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగేఅవసరం ఉండదు. 15 మార్చి 2024 నుండి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ 'వాహన్' పోర్టల్‌లో చేరనుంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే రవాణాశాఖలో అనే సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే లైసెన్సుల కోసం సారథిని ప్రవేశపెట్టగా...తాజాగా వాహనాల రిజిస్ట్రేషన్ల కోసం వాహన్ పోర్టల్‌ను అనుసంధానిస్తోంది. ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల వన్ నేషన్ – వన్ రిజిస్ట్రీ కల సాకారం అయ్యే అవకాశం ఉంది. అంతేకాదు వాహనదారుల ఇబ్బందులకు సైతం ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా లేకపోలేదు., News News, Times Now Telugu