బాత్రూంలను క్లీన్ చేసే రసాయనాలతో శ్రీవారి లడ్డూ తయారీ: మరో బాంబు పేల్చిన సీఎం చంద్రబాబు నాయుడు

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ ప్రసాదంతో శ్రీవేంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు అని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు రసాయనాలతో తయారైన కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయించారు అని మండిపడ్డారు. బాత్రూంలను శుభ్రపరిచేందుకు వినియోగించే రసాయనాలతో ఆ నెయ్యి తయారు చేయించి లడ్డూల్లో వాడారు అంటూ సీఎం చంద్రబాబు నాయుడు బాంబ్ బ్లాస్ట్ చేశారు.కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కలగట్లలో మీ భూమి- మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు రాజముద్రతో, ఆధునిక భద్రతా ఫీచర్లతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రసంగించారు ‘నెయ్యి కల్తీ కాలేదని సీబీఐ, సిట్ క్లీన్ చిట్ ఇచ్చిందని మాట్లాడుతున్నారు...కానీ వాళ్ల బాబాయి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని చెప్పారు. కల్తీ ప్రసాదంతో టీటీడీని అపవిత్రం చేస్తే దానిని సరిదిద్దే ప్రయత్నం చేశాను. గతంలో లడ్డూకి, ఇప్పుడు అందించే లడ్డూకు చాలా వ్యత్యాసం ఉంది’అని సీఎం చంద్రబాబు నాయుడు వెల్లడించారు., News News, Times Now Telugu