తెలంగాణలో భానుడి భగభగలు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో 58 మంది మృతి

తెలంగాణలో తీవ్రమైన వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఆదివారం కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత ఏడు రోజులుగా ఎండల తీవ్రత రికార్డు స్థాయికి చేరడంతో ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా వడదెబ్బకు గురై 58 మంది మరణించారు. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే అత్యధికంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ సహా మెజారిటీ ప్రాంతాలు పొడిగా ఉండగా.. కొన్ని జిల్లాల్లో చెదురుమెుదురు వర్షాలు కురిశాయి. రాబోయే నాలుగు రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.